బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా నటించిన మూవీ ‘హోమ్‌బౌండ్’. తాజాగా ‘ఆస్కార్ 2026’ షార్ట్ లిస్ట్‌లో ఈ మూవీ చోటు దక్కించుకుంది. ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్’ విభాగంలో భారత్ తరపున ఇది ‘ఆస్కార్ 2026’ బరిలో దిగింది. ఇక వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో స్నేహం, వివక్ష, ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే పోటీ, కోవిడ్ కష్టాలు తదితర అంశాలను చూపించారు.