నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు గోపీచంద్ మలినేని ‘NBK-111’ మూవీ తెరకెక్కించనున్నాడు.. ఈ సినిమా కోసం బాలయ్య సింగర్‌గా మారనున్నారట. ఇందులో ఆయన ఓ పాట పాడనున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపాడు. అది ‘బాహుబలి’లోని ‘సాహో రే బాహుబలి’ పాట తరహాలో ఉంటుందని పేర్కొన్నాడు. ఇక చారిత్రక అంశాలతో ముడిపడిన ఈ యాక్షన్ డ్రామాలో నయనతార కథానాయికగా నటించనుంది.