ప్రకాశం: తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి రూ. 43వేలు విలువచేసే సీసీ కెమెరాలు బుధవారం HM సుధాకర్ బాబుకు అందజేశారు. తాము చదువుకున్న పాఠశాల మీద మమకారం, సీసీ కెమెరాలు ఏర్పాటు వలన పాఠశాల ఆస్తుల రక్షణతో పాటు విద్యార్థుల కదలికలను గమనించవచ్చనే ఉద్దేశంతో అందించినట్లు పూర్వ విద్యార్థి, CRPF కానిస్టేబుల్ ఏరువ మనోహర్ రెడ్డి తెలిపారు.