SRCL: ప్రశాంత వాతావరణంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని, జిల్లా ఎస్పీ మహేష్ బీ గితే అన్నారు. గంభీరావుపేట మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేల భద్రత పరమైన పలు సూచనలు చేశారు.