కోనసీమ: రామచంద్రపురం నియోజకవర్గంలో వివిధ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థినీ విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శ్రీకారం చుట్టారు. ఈనెల 21న ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు రామచంద్రపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా విద్యార్థులకు మెగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.