VZM: బొండపల్లి మండలంలోని గొల్లుపాలెం గ్రామంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో గొర్ల బంగారునాయుడు చెందిన గడ్డివాము కాలిపోయిందని గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి రవి ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో సుమారు 15 వేల రూపాయలు ఆస్తి నష్టం సంభవించినట్లు చెప్పారు. కాల్చిన సిగరెట్టు ఆర్పకుండా విసిరేసినందున ప్రమాదం సంభవించిందని చెప్పారు.