AKP: విద్యార్థుల్లో సృజనాత్మకను వెలికితీయడానికి సైన్స్ ఫెయిర్ దోహదపడుతుందని జడ్పీ హైస్కూల్ హెచ్ఎం వైవి రమణ అన్నారు. యలమంచిలి పట్టణం కొత్తపేట జడ్పీ హైస్కూల్లో బుధవారం సైన్స్ ఫెయిర్‌ను హెచ్ఎం ప్రారంభించారు. మండలంలో 10 పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైన్స్ ఫెయిర్‌లో పాల్గొని వారు తయారుచేసి తీసుకొచ్చిన ప్రాజెక్టులు ప్రదర్శించారు.