E.G: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాజానగరం నియోజకవర్గ మాజీ ఇంఛార్జి, ప్రస్తుత ‘రుడా’ అధ్యక్షుడు బొడ్డు వెంకట రమణ చౌదరి పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఏడు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పదవిని ఆయనకు అధిష్ఠానం కేటాయించింది. రాజానగరం స్థానం జనసేనకు కేటాయించడంతో, రమణ చౌదరి ఈ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం.