AKP: నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈనెల 21వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.