NLR: కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. బుధవారం సమ్మె కొనసాగింది. కార్మికుల సమ్మెతో నగరంలో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయి పారిశుధ్యం అధ్వానంగా తయారయింది. వ్యాధులు ప్రబలుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో సమ్మె విరమింప చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.