KMR: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో డీసీసీబీ ఛైర్మన్ గుంట రమేష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆయన, సామాన్యుడిలా క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.