E.G: గోకవరం మండలం మల్లవరం గ్రామంలో ఇటీవల అగ్రి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వైసీపీ సీనియర్ నాయకుడు జ్యోతుల రామస్వామి బుధవారం ముమ్మన పెద్ద కాపు, గంగరాజు వీర్రాజు నూకరత్న కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం, గ్యాస్ స్టవ్ కిట్స్, ఇద్దరు మహిళలకు 2 కుట్టు మిషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.