కాంగ్రెస్ పార్టీ రాజకీయ విలువలని దిగజార్చిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ సోనియా గాంధీ దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని నడ్డా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.