జగిత్యాల రూరల్ మండలంలోని తాటిపల్లి గ్రామ సర్పంచ్‌గా బొలిశెట్టి గంగారెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా తన ప్రత్యర్థులపై అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపును కైవసం చేసుకున్నారు. తనను సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు ఆయన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.