PDPL: రామగుండం సింగరేణి సంస్థ మూసివేసిన మేడిపల్లి OCP-4 ప్రాజెక్టు సమీపంలోని లింగాపూర్ పరిసర ప్రాంతాలలో పులి సంచారాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు జిల్లా ఫారెస్ట్ అధికారి శివయ్య సిబ్బంది ఆధ్వర్యంలో సాయంత్రం లింగాపూర్ సమీపంలోని స్మశాన వాటిక పరిసరాలలో పరిశీలిస్తున్నారు. పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.