ADB: సాత్నాల మండలంలోని రామాయి గ్రామపంచాయతీ సర్పంచిగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి కుంచాల మహేందర్ గెలుపొందారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రత్యర్థి బి.రాజారెడ్డిపై 145 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాన్ని అభివృద్ధి దిశకు తీసుకెళ్తామని మహేందర్ పేర్కొన్నారు.