KRNL: గ్రామీణ ప్రాంతాల స్వచ్ఛభారత్ పారిశుద్ధ్య కార్మికులకు నెలకు కనీసం రూ.15,000 వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరులో సీఐటీయూ మండల కార్యదర్శి బి. రాముడు మాట్లాడుతూ.. ప్రస్తుతం రూ. 6,000 మాత్రమే ఇవ్వడం, వేతనాలు పెండింగ్, పీఎఫ్, సెలవులు లేకపోవడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన జీవోలను అమలు చేయాలని కోరారు.