TG: రంగారెడ్డి జిల్లా చేగూరులోని కన్హా శాంతివనాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించారు. శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్ చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. శాంతివనాన్ని సందర్శించిన అనంతరం దాజీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. శాంతివనంలో చేపడుతున్న కార్యక్రమాల గురించి చర్చించారు. అలాగే, శాంతివనంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.