దేశీయ కరెన్సీ రూపాయికి మళ్లీ దెబ్బ పడింది. డాలర్ ముందు నిలవలేక విలవిలలాడుతోంది. ఇవాళ ఇంట్రాడే ట్రేడింగ్లో ఏకంగా 26 పైసలు నష్టపోయి.. రూ.90.75 వద్ద ఆల్టైమ్ కనిష్ఠాన్ని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో మన కరెన్సీ పతనం కొనసాగుతూనే ఉంది. రూపాయి విలువ ఇంతలా పడిపోవడం మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.