KNR: తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్లెత్తుల స్వరూప విజయం సాధించారు. తమ సమీప అభ్యర్థి మల్లెత్తుల పద్మపై 139 ఓట్లతో విజయం సాధించారు. తన విజయానికి సహకరించిన గ్రామ ప్రజలకు స్వరూప కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.