WG: తణుకు మున్సిపాలిటీలో దొడ్డిదారిన మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం ఆయన తణుకులో మీడియా సమావేశంలో మాట్లాడారు. కనీసం గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఉండే విధంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.