MNCL: ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు టోకెన్లను తప్పనిసరిగా తీసుకోవాలని జన్నారం మండలంలోని పోన్కల్ క్లస్టర్ ఏఈవో త్రిసంధ్య కోరారు. సోమవారం జన్నారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. ధాన్యంలో 17% తేమ ఉంటేనే కొనుగోలు చేయాలని ఖచ్చితమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. పగటివేళ ధాన్యాన్ని ఎండకు ఆరబోసి, రాత్రివేళ కవర్లు కప్పాలన్నారు.