మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది. కురుపాం, జియ్యమ్మవలస, మండలాల్లో తిరుగుతూ గ్రామస్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆదివారం కురుపాం మండలం సీతంపేటలో కోకో, కర్బూజ, పామ్ ఆయిల్ తోటలను ఏనుగుల గుంపు నాశనం చేయడంతో రైతు చిన్నారావు, తదితరులు బోరున విలపించారు. వ్యవసాయ పరికరాలను సైతం ధ్వంసం చేసింది.