KMM: విశ్వనాధపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇస్లావత్ రాజు తరఫున ఆయన గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్లావత్ రాజుకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలిచారు. మహిళలు, యువతతో సహా వివిధ వర్గాల ప్రజలు ప్రచారంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.