KNR: కరీంనగర్ పట్టణంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, దేవాలయ ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.