NLR: అమర జీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసికావడం గొప్ప విషయం అన్నారు. ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పితామహుడు అని కొనియాడారు.