W.G: పాలకొల్లులో రూ.250 కోట్లతో 220/33 KV విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైనట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులోని మంత్రి కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పాలకొల్లుకు కావలసిన విద్యుత్ భీమవరం, నర్సాపురం నుంచి వస్తోందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల్లో విద్యుత్‌కు ఆటంకం కలుగుతోందని చెప్పారు. అందుకే లంకలకోడేరులో స్థలం ఎంపిక చేశామన్నారు.