BPT: రేపల్లె రూరల్ మండలం రాజుకాల్వ వద్ద పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు రూ.10.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న R&B రోడ్డుకు సోమవారం బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి మంత్రి అనగాని సత్య ప్రసాద్ శంకుస్థాపన చేశారు. అధ్వాన్నంగా మారిన రహదారుల సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే నిధులు మంజూరు చేశారని తెలిపారు.