AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లను బహుకరించారు. సొంత నిధులతో పాఠశాలకు కంప్యూటర్లు, అవసరమైన ఇతర ఫర్నిచర్‌ను అందజేశారు. ఈనెల 5న జరిగిన పేరెంట్స్ సమావేశంలో పవన్ సాయం చేస్తానని మాట ఇచ్చిన విషయం తెలిసిందే.