PDPL: ధర్మారం మండలం పైడిచింతలపల్లిలో ఈ నెల 14న జరిగిన ఎన్నికల్లో 70 సంవత్సరాల సున్నం రాజయ్య సర్పంచ్‌గా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గతంలో పలుమార్లు ఒత్తిళ్లతో నామినేషన్ ఉపసంహరించుకున్న రాజయ్య ఈసారి ఎవరి మాటా వినకుండా బరిలో దిగాడు. అయితే డబ్బు, మద్యం పంచకుండా 281 ఓట్లతో సమీప ప్రత్యర్థిపై 26 ఓట్ల మెజారిటీ సాధించారు.