విశాఖ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 90 మంది అంగన్వాడీ కార్యకర్తలకు 5జీ టెక్నాలజీతో కూడిన రూ.12,500 విలువైన ఉచిత స్మార్ట్ ఫోన్లను క్యాంప్ కార్యాలయంలో సోమవారం పంపిణీ చేశారు. బాల సంజీవిని, పోషణ ట్రాకర్ ద్వారా పిల్లల గ్రోత్ మానిటరింగ్, లబ్ధిదారుల నమోదు వేగంగా జరుగుతుందని తెలిపారు.