GDWL: మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సాయంత్రం 5 గంటల లోపు ప్రచారం పూర్తిగా ముగించాలని సోమవారం ఉండవల్లి ఎస్సై ఆర్ శేఖర్ తెలిపారు. సమయం ముగిసిన తర్వాత ఎలాంటి సభలు, ర్యాలీలు, లౌడ్ స్పీకర్లు, వాహనాల ద్వారా ప్రచారం నిషేధమని, సామగ్రిని తొలగించాలని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.