చలికాలంలో చిలగడదుంప తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచి వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. చలికాలంలో వచ్చే అలసటను తగ్గించి శక్తిని అందిస్తుంది. శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య ఛాయల్ని తగ్గించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. గుండె జబ్బులను దూరం చేస్తుంది.