VSP: ఎంఆర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు అవగాహన సదస్సులకే పరిమితమైన పోలీస్ కార్యక్రమాల్లో తొలిసారిగా నిర్వహించిన ఈ వైద్య శిబిరం అందరినీ ఆకర్షించింది. సీఐ దివాకర్ యాదవ్ స్వయంగా పర్యవేక్షించి వైద్య పరీక్షలు, మందులు, స్నాక్స్ అందించి ప్రజలతో మమేకమయ్యారు.