UAEలోని అబుదాబి వేదికగా ఇవాళ IPL 2026 మినీ వేలం జరగనుంది. వేలంలో హైదరాబాద్, ఆంధ్ర జట్లకు చెందిన 17 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వీరిలో భారత్కు ఆడిన కేఎస్ భరత్ తన కనీస విలువను రూ.75 లక్షలుగా నిర్ణయించుకోగా.. మిగతా క్రికెటర్లంతా రూ.30 లక్షల ధరలో వేలానికి సిద్ధమయ్యారు. హైదరాబాద్ జట్టు నుంచి 9 మంది, ఆంధ్ర నుంచి 8 మంది ఎదురు చూస్తున్నారు.