E.G: వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజమండ్రి నగర పాలక సంస్థ మాజీ వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్ సోమవారం రాత్రి ఆకస్మికంగా గుండె పోటుతో మరణించారు. ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వైసీపీ నేతలు, అభిమానులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.