ASF: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెబ్బెన మండలంలో పోలీసులు బెల్ట్ షాప్పై దాడి చేసి రూ.10వేల విలువ గల మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై వెంకట కృష్ణ తెలిపారు. దేవుల గూడ గ్రామానికి చెందిన రాం కుమార్ బెల్ట్ షాపు నిర్వహిస్తున్నట్లు తెలిసి దాడి చేశామన్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.