PLD: నకరికల్లులో మంగళవారం ధనుర్మాస వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, సీతా రామ లక్ష్మణస్వామి, గోదా రంగనాధస్వామికి నేటి నుంచి జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షుడు చిన్ని ప్రసన్నాంజనేయులు తెలిపారు. నెల రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి.