గోవాలో అగ్నిప్రమాదం జరిగిన నైట్ క్లబ్ యజమానులు, సోదరులైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాను థాయిలాండ్ పోలీసులు భారత్‌కు అప్పగించారు. నిందితులు అరెస్టు భయంతో థాయ్‌లాండ్‌కు పారిపోవడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ బ్లూ నోటీసు జారీ చేయడంతో థాయ్‌లాండ్ పోలీసులు లూథ్రా సోదరులను అరెస్టు చేశారు.