NLG: దేవరకొండ డివిజన్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రజలను కోరారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి, డివిజన్ గ్రామాలను జిల్లాలో ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.