SRPT: స్థానిక సంస్థల ఎన్నికలు మూడో విడతలో భాగంగా పాలకీడు మండలంలో రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 22 గ్రామపంచాయతీలు, 186 వార్డు స్థానాలు ఉండగా, మూడు గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన గ్రామపంచాయతీలకు పోలింగ్ జరగనుండగా, 18,616 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 160 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు.