PPM: మక్కువ పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్పీ మనీషారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వారికి పలు సూచనలు చేసారు. అలాగే సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ మక్కువ ఎస్ఐ, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.