VZM: ఓట్ చోరీ అంశంపై కాంగ్రెస్ పార్టీ తన ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసింది. ఆదివారం ఓట్ చోరీకి వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహ ర్యాలీ కార్యక్రమం చేపట్టింది. ఈ ర్యాలీలో విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యా సాగర్, ఐసీసీ సెక్రటరీ గోగాడ శ్రీనివాస్ పాల్గొన్నారు.