మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన రెండో విడత స్థానిక ఎన్నికల పూర్తయ్యే సరికి 79.2% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. మొత్తం 1,37,382 ఓట్లకు గాను 1,08,808 ఓట్లు పోలయ్యాయని తెలిపారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ అన్ని గ్రామపంచాయతీలలో ప్రశాంతంగా ముగిసిందన్నారు.