బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫైనల్ ఎపిసోడ్ ఈ నెల 21న జరగనుంది. అయితే ఇవాళ కంటెస్టెంట్ భరణి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ రేసులో తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, పవన్, సంజన ఉంటారు. అయితే తాజాగా రిలీజైన ప్రోమోలో హోస్ట్ నాగార్జున.. విన్నర్‌కు రూ.50 లక్షల ప్రైజ్ మనీని ప్రకటించారు. ఇందులో ట్యాక్స్ రూపంలో కొంత కట్ అవుతుంది.