AP: రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన 22 హోటళ్లు, రిసార్టులు, ఇతర ఆస్తుల లీజుపై ముందడుగు పడింది. బిడ్ల మదింపు కోసం ప్రత్యేక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ఈ కమిటీకి ఛైర్మన్గా ఉంటారు. అలాగే, పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన ఆస్తుల నిర్వహణను లీజుపై ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.