KDP: బ్రహ్మంగారిమఠంలో నేడు ఉదయం నుంచి ఎయిర్ టెల్ టెలికాం నెట్ వర్క్ సిగ్నల్ పనిచేయక వినియోగ దారులు తీవ్ర అవస్థలు చెందారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కావడం.. అందునా ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సిగ్నల్స్ పనిచేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కొన్ని రోజులుగా ఎయిర్టెల్ సిగ్నల్ పనిచేయక మూగబోయింది.