ధర్మశాల వేదికగా జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో సౌతాఫ్రికా 20 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్, కుల్దీప్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. సఫారీ కెప్టెన్ మార్క్రమ్ 61 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లంతా భారత బౌలర్ల ధాటికి పెవిలియన్ దారి పట్టారు.