ADB: భోరజ్ మండలంలోని గిమ్మ గ్రామపంచాయతీ సర్పంచిగా ప్రద్యుమ్న భారీమెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ బలపరిచిన ప్రత్యర్థిపై ఆయన విజయం సాధించారు. సుమారు 1082 ఓట్లతో ఆయన గెలుపొందడంతో పలువురు ఆయన్ను శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 20వ తేదీన ఈయన సర్పంచి పదవికి పూర్తి బాధ్యత స్వీకరించనున్నారు. ఆయన గెలుపుపై ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు.