TG: మూడో దశలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు గ్రామస్థాయి వరకు చేరుతున్నాయని స్పష్టం చేశారు.